ప్రభాస్ “ఆదిపురుష్” రిలీజ్ అప్పుడే!

ప్రభాస్ “ఆదిపురుష్” రిలీజ్ అప్పుడే!

Published on Nov 1, 2022 12:05 AM IST


పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యం కావడంతో రిలీజ్ డేట్ పోస్ట్ పాన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం, మేకర్స్ ఇప్పుడు ఈ సినిమాను మే, 2023 లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

VFX వర్క్ కి చాలా సమయం తీసుకుంటుండడంతో, గాసిప్ ప్రకారం రిలీజ్ ఆలస్యం కానుంది. ఆదిపురుష్ 2023 జనవరి 12న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. కానీ, దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తుండగా, కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు