గ్రాండ్ విజువల్స్ తో అద్దిరిపోయిన ప్రభాస్ “ఆదిపురుష్” టీజర్!

గ్రాండ్ విజువల్స్ తో అద్దిరిపోయిన ప్రభాస్ “ఆదిపురుష్” టీజర్!

Published on Oct 2, 2022 7:25 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి గా, ఓం రౌత్ దర్శకత్వం లో హిందూ పౌరాణిక గాథ అయిన రామాయణం ఆధారం గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్. టీ సిరీస్ ఫిల్మ్స్ మరియు రెట్రో ఫైల్స్ బ్యానర్ లపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ ను విడుదల చేయడం జరిగింది. “భూమి కృంగినా నింగి చీలినా, న్యాయం చేతుల్లోనే అన్యానికి సర్వ నాశనం. వస్తున్నా, న్యాయం రెండు పాదాల తోని పది తలల అన్యాయాన్ని అణచి వేయడానికి, నా ఆగమనం అధర్మ విద్వంసం” అనే పవర్ ఫుల్ డైలాగ్స్ తో టీజర్ ఉంది. అద్భుతమైన విజువల్స్ తో పాటుగా, అద్దిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో టీజర్ ఉంది. ఈ చిత్రం జనవరి 12, 2023 న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రం లో రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు