1960, 70 ల బ్యాక్ డ్రాప్లో ప్రభాస్ నెక్స్ట్ సినిమా !


‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమాలు చేస్తారో చూడాలనే ఆసక్తితో ఉన్న ప్రేక్షకులను ప్రభాస్ మరింత ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఎవరైనా పెద్ద దర్శకుడితో సినిమాను ఓకే చేస్తాడనుకుంటే కేవలం ఒకే ఒక సినిమా చేసిన సుజీత్ దర్శకత్వంలో ‘సాహో’ కు సైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రభాస్ తన తర్వాతి సినిమాగా ఒక లవ్ స్టోరీని ఎంచుకుని ఇంకాస్త సప్రైజ్ చేశారు.

అది కూడా యూరప్ బ్యాక్ డ్రాప్లో 1960, 70 ల కాలంలో నడిచే ప్రేమ కథగా ఉండనుందని టాక్. అయితే ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేయనున్నాడు. అంతేగాక ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంమగీతాన్ని అందించనున్నాడు. మరి ఇన్ని విశేషాలున్న ఈ ప్రేమ కథ ఎలా ఉండబోతోందో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘సాహో’ చిత్రం వచ్చే ఏడాదిలో రిలీజ్ కానుంది.