ప్రభాస్ “రాధే శ్యామ్” బ్రేక్ ఈవెన్ కి మొత్తం ఎంత వసూలు చేయాలంటే?

Published on Mar 9, 2022 8:30 pm IST


యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధే శ్యామ్. ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుండడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. 300 కోట్ల బడ్జెట్‌తో పలు భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ మొదటి రోజు నుంచి చెబుతున్నారు.

ఇప్పుడు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే, ఈ సినిమా దేశంలోనే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే విడుదలైన అన్ని భాషల్లో మినిమం 200 కోట్లు రాబట్టాలి. ప్రభాస్ పెద్ద స్టార్, మంచి ఓపెనింగ్స్ వచ్చేలా చూస్తాడు. అయితే మౌత్ టాక్, రివ్యూలను బట్టి మిగతా కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ బిజిఎమ్ స్వరపరిచారు.

సంబంధిత సమాచారం :