ఆదిపురుష్ కోసం ప్రభాస్ అంత తీసుకుంటున్నాడా?

Published on Oct 6, 2021 3:06 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’, ఆ తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ప్రభాస్ ఆది పురుష్ కోసం భారీగా రెన్యూమరేషన్ తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తుంది.

అయితే అత్యంత భారీ బడ్జెట్ సినిమా కావడంతో ప్రభాస్ ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్లు తీసుకున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమీతే భారతీయ సినిమాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ప్రభాస్ ఒకరని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం :