లేటెస్ట్: రెబల్ స్టార్ ప్రభాస్ “సలార్” రిలీజ్ డేట్ ఫిక్స్!

Published on Aug 15, 2022 1:15 pm IST

యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ సిరీస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సలార్. ఈ చిత్రం లో ప్రభాస్ మునుపెన్నడూ కనిపించని రీతిలో కనిపిస్తున్నారు. మరింత పవర్ ఫుల్ గా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28, 2023 లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇప్పటి వరకూ ఒక ఫస్ట్ లుక్ నే విడుదల చేసిన మేకర్స్, ఈ అనౌన్స్ మెంట్ కోసం సరికొత్త పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ లో ప్రభాస్ సరికొత్త అవతార్ లో దర్శనం ఇస్తున్నారు. రెండు చేతుల్లో రక్తపు కత్తులతో బాక్సాఫీస్ పై దాడికి సిద్దం అన్నట్లు గా ఉన్నారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను మరింత గా ఆకట్టుకుంటుంది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు మరొక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :