ప్రభాస్ సలార్ సినిమాపై ఇంట్రెస్టింగ్ ఇన్‌ఫో ..!

Published on Oct 9, 2021 3:00 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలో ఇప్పటికే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని పూర్తి చేయగా ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’, ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలను ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా “సలార్” సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ ఇన్‌ఫో ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తుంది.

అయితే ఇప్పటికే ఈ సినిమా రెండు మేజర్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకోగా, త్వరలోనే మూడో షెడ్యూల్‌కి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో ఎక్కువగా భారీ యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. అయితే ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం సినిమా మొత్తం బడ్జెట్‌లో దాదాపు సగం బడ్జెట్‌ని యాక్షన్‌ సన్నివేశాల కోసమే ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :