తమిళంలో రిలీజ్ కానున్న ప్రభాస్ సూపర్ హిట్ సినిమా !
Published on Oct 11, 2017 8:51 am IST

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో రాజమౌళి తెరకెక్కించిన సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళితో చేసిన సినిమాలే ప్రభాస్ ను స్టార్ హీరోని చేశాయి అనొచ్చు. అలాంటి వాటిలో ముఖ్యమైంది ‘ఛత్రపతి’. 2005లో విడుదలైన ఈ చిత్రం ప్రభాస్ ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసి, స్టార్ డమ్ ను తెచ్చి పెట్టింది. అందుకే ఈ సూపర్ హిట్ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఇప్పటికీ క్రేజ్ ఉంది.

అందుకే ఈ సినిమాను ఇప్పుడు తమిళంలోకి ‘చంద్రమౌళి’ పేరుతో డబ్ చేశారు. ఈ అనువాద చిత్రాన్ని రేపే తమిళనాట రిలీజ్ చేయనున్నారు. ‘బాహుబలి-1, బాహుబలి-2’ సినిమాలతో రాజమౌళి, ప్రభాస్ ల కాంబో దక్షిణాదిన ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న తరుణంలో రిలీజవుతున్న ఈ డబ్బింగ్ చిత్రం ఆ క్రేజ్ ను ఏమేరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.

 
Like us on Facebook