ప్రభుదేవా డైరెక్షన్‌కు గుడ్‌బై చెప్పబోతున్నాడా?

Published on Sep 21, 2021 8:54 pm IST


ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవా తొలి చిత్రంతోనే మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత పౌర్ణమి సినిమాకు దర్శకత్వం వహించగా ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. ఆ తర్వాత పలు సినిమాలకు డైరెక్టర్‌గా వ్యవహరించిన సక్సెస్‌లు మాత్రం రావడం లేదు.

ఇటీవలే వచ్చిన దబాంగ్ 3, రాధే సినిమాలు కూడా ప్లాప్‌గానే మిగిలాయి. దీంతో ఇక డైరెక్షన్‌కు గుడ్‌బై చెప్పాలని ప్రభుదేవా నిర్ణయించుకున్నారని సమాచారం. నటుడిగా వరుస అవకాశాలు వస్తుండటంతో ఇకపై పూర్తిగా నటనపైన దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందనేది చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :