
కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడి అవతారం ఎత్తిన ప్రభుదేవా వరుస విజయాలతో హిందీ చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నాడు. సౌత్ రీమేక్ లతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతూ బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారాడు.
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రభుదేవా త్వరలో ప్రయోగాలు చేయడానికి రెడీ అంటున్నాడు. ఓ హారర్ థ్రిల్లర్ సినిమాకు దర్శకత్వం వహించాలనుందని ప్రభుదేవా చెప్పారు. అందుకోసం స్వయంగా కథ కూడా రాస్తున్నారట. తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
ప్రభుదేవాను హిందీలో స్టార్ దర్శకుడిని చేసింది సౌత్ సినిమా రీమేకులే. అవి కూడా మాస్ కమర్షియల్ ఫార్ములా సినిమాలు. సొంత కథలతో రూపొందించిన ఆర్.రాజ్ కుమార్ పరాజయం పాలైంది. తనది కాని జోనర్ లో చేయబోతున్న ఈ హారర్ థ్రిల్లర్ సినిమా ఎటువంటి ఫలితం అందిస్తుందో..? వెయిట్ & సి.