బిగ్ మెగాస్టార్ ఇన్స్పిరేషన్ అంటున్న ప్రభుదేవా!

Published on Apr 29, 2022 6:15 pm IST

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఆచార్య. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగం గా చిత్ర యూనిట్ ఇంటర్వ్యూ లతో బిజిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరక్టర్ లతో ఇంటరాక్ట్ అయ్యారు. అందుకు సంబంధించిన వుడియో ను షేర్ చేశారు ప్రముఖ నటుడు, కొరియోగ్రఫర్, డైరెక్టర్ ప్రభుదేవా.

అంతేకాక ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించారు. బిగ్ మెగాస్టార్ యంగ్ డైరక్టర్ లతో ఇంటరాక్ట్ అవుతున్నారు అని, ఇన్స్పిరేషన్, స్వీట్ సర్ అంటూ చెప్పుకొచ్చారు. ప్రభుదేవా చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సంబంధిత సమాచారం :