విడుదల తేదీ : ఏప్రిల్ 10, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, ఎస్ జే సూర్య, యోగి బాబు, గౌరీ జి కిషన్, అమృత అయ్యర్ తదితరులు
దర్శకుడు : విగ్నేష్ శివన్
నిర్మాణ సంస్థ: నయనతార, ఎస్ ఎస్ లలిత్ కుమార్
సంగీతం : అనిరుద్
ఛాయాగ్రహణం : రవి వర్మన్
ఎడిటింగ్ : ప్రదీప్ ఈ రాఘవ
సంబంధిత లింక్స్ : ట్రైలర్
వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న టాలెంటెడ్ యువ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు విగ్నేష్ శివన్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమానే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (Love Insurance Kompany). పలు వాయిదాలు తర్వాత ఎట్టకేలకు థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
Love Insurance Kompany కథ:
2040 సంవత్సరంలో ఈ సినిమా సెటప్ కనిపిస్తుంది. అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంది కానీ ప్రేమకు ఎందుకు ఇన్సూరెన్స్ లేదు. అలాంటి ఒక ఇన్సూరెన్స్ యాప్, కంపెనీను పెట్టి ఎవరికి ఎవరు కరెక్ట్ ఎంత వరకు కరెక్ట్, వాళ్ళ ప్రేమ స్కోర్ ని కొలిచి ఓ యాప్ ద్వారా అనేకమంది ప్రేమ బంధాలను ఆ కంపెనీ హెడ్ సూర్య (ఎస్ జే సూర్య) డిసైడ్ చేస్తాడు. అలాంటి సమయంలో ఫోన్ కి లైక్ యాప్ కి ఎడిక్ట్ అయ్యిన దీమా(కృతి శెట్టి) ని అసలు ఫోన్ వాడకం అంటే ఏంటి తెలియని ఆర్గానిక్ ప్రపంచానికి చెందిన కుర్రాడు వైబ్ వాసు (ప్రదీప్ రంగనాథన్) ప్రేమిస్తే ఏమవుతుంది? వీరి ప్రేమలో లైక్ ఎలా చిచ్చు పెట్టింది? దాని నుంచి వాసు ఎదుర్కొన్న సవాలు ఏంటి? ఎందుకు తను ఫోన్ వాడడు. ఈ క్రమంలో తన ప్రేమని గెలిపించుకున్నాడా లేదా? సూర్యతో చేసిన ఛాలెంజ్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్:
ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది అని చెప్పొచ్చు. లవ్ టుడే నుంచి డిఫరెంట్ లైన్స్ తో వచ్చిన ప్రదీప్ ఈసారి ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ టచ్ చేయడం ఒకింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలానే ఇందులో సెటప్ చేసుకున్న కొన్ని సీన్స్ ఓకే అనిపిస్తాయి. స్టార్టింగ్ సీన్ నుంచి ఫ్యూచరిస్టిక్ ప్రపంచంకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకున్న సెటప్ టెక్నాలజీ లాంటివి బాగున్నాయి.
ఇక నటీనటుల్లో ప్రదీప్ రంగనాథన్ తన వల్ల అయ్యింది అంతా బాగా చేసాడు. తన లోని ప్రేమికుణ్ణి చూపించే క్రమంలో పడే స్ట్రగుల్ అక్కడక్కడా కామెడీ సీన్స్ లాంటివి బాగా చేశాడు. అలాగే కృతి శెట్టి కూడా తన రోల్ లో బాగా ఫిట్ అయ్యి దీమాగా డీసెంట్ పెర్ఫార్మన్స్ తో పాటుగా మంచి గ్లామర్ షో కూడా అందించింది.
వీరితో పాటుగా ఎస్ జే సూర్య మరోసారి షైన్ అయ్యారని చెప్పొచ్చు. తన పాత్ర అందులో తన పెర్ఫార్మన్స్ మెయిన్ గా ప్రదీప్ తో ఫేస్ ఆఫ్ సీన్స్ ఈ సినిమాలో వర్కవుట్ అవుతాయి. ఇక వీరితో పాటుగా యోగిబాబు కామెడీ, గౌరీ జి కిషన్, చిన్న కామియో
లో అమృత అయ్యర్ తదితరులు తమ పాత్రల్లో బాగా చేసారు. అలానే అక్కడక్కడా ఒకటీ రెండు ఎమోషనల్ బ్లాక్స్ ఓకే అనిపిస్తాయి.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో ఫ్యూచరిస్టిక్ సెటప్ ఒకటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది తప్పితే మిగతా ట్రీట్మెంట్ అంతా రొటీన్ గానే ఉంది. ఒక యాప్ ని సెట్ చేసి అందులో చాలా రొటీన్ ప్రేమకథని దర్శకుడు నడిపించారు. కొన్ని సీన్స్ లో లవ్ ట్రాక్ ఉదాహరణకు విటివి గణేష్ తన భార్యతో ట్రాక్ చిన్నదే అయినా బాగుంది అనిపిస్తుంది.
కానీ మిగతా కథనంలో లవ్ ఎపిసోడ్స్ మాత్రం అంత ఇంపాక్ట్ కలిగించేలా కనిపించవు. అలానే కథనం కూడా సాగదీతగా అనిపిస్తుంది. కృతిపై కొన్ని సోలో సీన్స్ ని తగ్గించాల్సింది. వీటితో పాటుగా సినిమాలో కాన్సెప్ట్ చూస్తున్నంతసేపు ఫస్టాఫ్ లో 2.0 సెకండాఫ్ లో హీరో విలన్ మధ్య క్లాష్ లాంటివి కొన్ని సీన్స్ ధనుష్ రఘువరన్ బీ టెక్ లాంటి సినిమాలని గుర్తు చేస్తాయి.
ఇలా ఇందులో ఒక్క ఫ్యూచరిస్టిక్ సెటప్ అనేది పక్కన పెడితే మిగతా అంతా ఫ్లాట్ గా రొటీన్ గానే అనిపిస్తాయి. ఇంకా ప్రదీప్ రంగనాథన్ రోల్ ని అసలు ఫోన్ ఎలా వాడాలో కూడా తెలీకుండా అది కూడా 2040 లలో ఉంటారని చూపించడం ఒకింత రియాలిటీకి దూరంగా ఉంటే..
అదే పాత్ర పలు సోషల్ మీడియా యాప్స్ ని ఎలా వాడాలి అప్పటి రోజుల్లో అవి లేకపోతే ఏ పనులూ జరగవని అంత స్పష్టంగా చెప్పడం లాంటివి లాజిక్ కి దూరంగా ఉంటాయి. ఇంకా ఇదొక భవిష్యత్ కాలంలో సెటప్ చేసింది కాబట్టి ఇంకా అడ్వాన్స్డ్ గా మరిన్ని సీన్స్ ని ప్లాన్ చేసుకొని ఉంటే అవైనా కొంచెం ఎగ్జైట్ చేసేవి.
సాంకేతిక వర్గం:
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు మాత్రం డీసెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ప్రొడక్షన్ డిజైన్, ఫ్యూచర్ వరల్డ్ సెటప్ ని నీట్ గా చేసుకున్నారు. అయితే తెలుగు వెర్షన్ లో చిన్న చిన్న విజువల్ మిస్టేక్స్ కనిపించాయి. అనిరుద్ సంగీతం జస్ట్ ఓకే రేంజ్ లో ఉంది. ఒకటీ రెండు పాటలు తప్ప మిగతావి ఇంపాక్ట్ చూపించలేదు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా కట్ చేయాల్సింది.
ఇక దర్శకుడు విగ్నేష్ శివన్ విషయానికి వస్తే.. తన ఐడియా ఇందులో ఓకే కానీ ఫ్యూచర్ వరల్డ్ ప్లాన్ చేసుకున్న ప్రేమకథని మాత్రం చాలా రొటీన్ గా డిజైన్ చేసుకున్నారు. కొన్ని సీన్స్ వరకు పర్వాలేదు కానీ మిగతా ట్రీట్మెంట్ మాత్రం రొటీన్ గానే అనిపిస్తుంది.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (LIK) డల్ గా సాగే ఫ్యూచరిస్టిక్ లవ్ డ్రామా అని చెప్పొచ్చు. ఇందులో మెప్పించే అంశాలు కంటే వీక్ గా అనిపించే అంశాలే ఎక్కువ కనిపిస్తాయి. దర్శకుడు ప్లాన్ చేసుకున్న లవ్ ట్రాక్ ఇందులో మిస్ ఫైర్ అయ్యింది. సో ఈ సినిమా ఆడియెన్స్ ని అంతగా మెప్పించదు.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team
