స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్య జైస్వాల్ !

23rd, April 2017 - 10:38:09 AM


‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందిన హీరోయినా ప్రగ్య జైస్వాల్ ఆ తర్వాత అక్కినేని నాగార్జున సరసన ‘ఓం నమో వెంకటేశాయ’, మంచు మనోజ్ తో ‘గుంటూరోడు’ చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి స్టేటస్ సాధించింది. ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొండుతున్న ‘నక్షత్రం’ లో విభిన్నమైన పోలీసాఫీసర్ రోల్ చేస్తున్న ఈమె తాజాగా స్టార్ హీరో రవి తేజ్ చిత్రంలో అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘రాజా ది గ్రేట్’ సినిమా చేస్తున్న రవితేజ అది పూర్తైన వెంటనే నూతన దర్శకుడు విక్రమ్ సిరికొండ డైరెక్షన్లో ‘టచ్ చేసి చూడు’ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్య జైస్వాల్ ను సెలెక్ట్ చేశారట. ప్రగ్య కూడా పాత్ర నైపథ్యం వినగానే ఒప్పుకుని డేట్స్ అడ్జెస్ట్ చేసే పనిలో ఉన్నారని వినికిడి. ఇకపోతే నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాసి ఖన్నాను మొదటి హీరోయిన్ గా సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.