“అఖండ” లో తన రోల్ రివీల్ చేసిన ప్రగ్యా..!

Published on Nov 27, 2021 10:05 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ సినిమా “అఖండ” కోసం అందరికీ తెలిసిందే. మరి రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా ఈ సందర్భంగా సాలిడ్ ప్రమోషన్స్ ని కూడా జరుపుకుంటుంది.

అలాగే సినిమా నటీనటులు కూడా ఇందులో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా నటించిన ప్రగ్యా జైస్వాల్ ఈ సినిమాలో తన పాత్రపై క్లారిటీ ఇచ్చింది. తాను ఈ సినిమాలో ఒక ఐ ఏ ఎస్ ఆఫీసర్ గా కనిపిస్తుందట.

సినిమా కథకి తగ్గట్టుగా దర్శకుడు బోయపాటి తన అతని చాలా బాగా రాసారని ఖచ్చతంగా ఆడియెన్స్ మరియు విమర్శకులను మెప్పించేదిలా తన పాత్ర ఉంటుందని కాన్ఫిడెంట్ గా చెబుతుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందివ్వగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :