అల్లు అర్జున్, రాజమౌళికి ప్రగ్యా జైస్వాల్ థాంక్స్!

Published on Nov 28, 2021 11:27 pm IST


నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబో లో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడం తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలకు ప్రేక్షకుల నుండి అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది.

ఈ చిత్రం లో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అఖండ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు ఎస్ ఎస్ రాజమౌళి లు హాజరు అయ్యారు. చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలుపుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ మేరకు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అల్లు అర్జున్ కి మరియు ఎస్ ఎస్ రాజమౌళి కి సోషల్ మీడియా వేదిక గా స్పెషల్ థాంక్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం :