ప్రగ్యా జైస్వాల్ కు లక్కీ ఛాన్స్


మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందున్న చిత్రం ”సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ తన హోం ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్నారు. ఇటివలే పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్లో పనులు జరుపుకొంటోంది. ఈ చిత్రం లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కన్నడ స్టార్ హీరో సుదీప్, తమిళ్ యువ కథానాయకుడు విజయ్ సేతుపతి మరియు జగపతి బాబు లాంటి స్టార్స్ నటించబోతున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందే ఈ సినిమాలో కథను బట్టి ముగ్గురు హీరోయిన్లు అవసరం. మొదటి హీరోయిన్ గా నయనతారను కన్ఫాం చేశారు. రెండవ హీరోయిన్ గా అనుష్కను అనుకొంటున్నారు. మూడవ హీరోయిన్ గా ప్రాగ్య జైస్వాల్ నటించబోతోందని సమాచారం. నరసింహారెడ్డి వెంట ఉండే మహిళా యోధురాలిగా ఈమె కనిపించబోతోందట.ఒకవేళ, చారిత్రాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నటించే ఛాన్స్ వస్తే ప్రగ్య లైఫ్ టర్న్ అయినట్టే.

అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.