విజయ్ దేవరకొండ పక్కన ఆ తెలుగమ్మాయి ఫిక్స్

18th, October 2017 - 12:00:34 PM


‘పెళ్ళి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ . ఇప్పుడు ఈ కుర్ర హీరోకు సినిమా ఆఫర్లు చాలానే వస్తున్నాయి. ఓ పక్క గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో పరుశురందర్శకత్వంలో నటిస్తూనే మరో సినిమా చెయ్యటానికి సిద్ధమైన తనకు ఇంకొక కొత్త ప్రాజెక్టు చేసే ఆఫర్ వచ్చింది. రాహుల్ సంక్రీత్యన్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాలో ఒక తెలుగమ్మయిని హీరోయిన్ గ సెలెక్ట్ చేసారు, అనంతపుతం లో పుట్టి పెరిగిన ప్రియాంక జవాల్కర్, విజయ్ దేవరకొండ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది.