“రంగ మార్తాండ” నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ – ప్రకాష్ రాజ్

“రంగ మార్తాండ” నా కెరీర్‌లో బెస్ట్ ఫిల్మ్ – ప్రకాష్ రాజ్

Published on Nov 8, 2022 3:40 PM IST


అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రంగ మార్తాండ. ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి ప్రకాష్ రాజ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రానికి మొదట దర్శకత్వం వహించాలని అనుకున్నాను, అయితే కృష్ణ వంశీ దర్శకత్వం వహించడానికి సరైన వ్యక్తి అని భావించా. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది.

ప్రకాష్ రాజ్ ఈ చిత్రం తన కెరీర్‌లో బెస్ట్ అని అన్నారు. పెర్ఫార్మెన్స్ వారీగా చూస్తే మీరు కొత్త వ్యక్తి ని చూస్తారు అని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో విడుదల తేదీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు