“మా”హితమే మా అభిమతం…ప్యానెల్ సభ్యులను ప్రకటించిన ప్రకాష్ రాజ్!

Published on Sep 29, 2021 9:04 pm IST


మా ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యం లో ప్రకాష్ రాజ్ తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. మీ ఓటే మీ వాయిస్ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. మా హితమే మా అభిమతం అని, మనస్సాక్షిగా ఓటేద్దాం, మా ఆశయాలను గెలిపిద్దాం అంటూ ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదిక గా పిలుపు ఇచ్చారు.

ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పోటీ చేస్తుండగా,శ్రీమతి జీవితా రాజశేఖర్ జనరల్ సెక్రెటరీ గా, అనితా చౌదరి జాయింట్ సెక్రటరీ గా,ఉత్తేజ్ జాయింట్ సెక్రటరీ గా, శ్రీకాంత్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా, బెనర్జీ వైస్ ప్రెసిడెంట్ గా, శ్రీమతి హేమ వైస్ ప్రెసిడెంట్ గా, నాగినీడు ట్రెజరర్ గా పోటీ చేస్తున్నారు.

అనసూయ, భూపాల్, బ్రహ్మాజీ, ఈటీవీ ప్రభాకర్, గోవింద రావు, ఖయ్యుం, కౌశిక్, ప్రగతి, కొండేటి సురేష్, శివా రెడ్డి, శ్రీధర్ రావు, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు, రమణ రెడ్డి, తనీష్, టార్జాన్, రోహిత్ లు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గా పోటీ చేస్తున్నారు. అక్టోబర్ 10 వ తేదీన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇందుకు సంబంధించిన ఎలక్షన్స్ జరగనున్నాయి.

సంబంధిత సమాచారం :