ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా…1997 చిత్రం పై ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు

ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా…1997 చిత్రం పై ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు

Published on Nov 15, 2021 1:05 PM IST

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం 1997. రియల్ ఇన్సిడెంట్స్‌ ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం ఇది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన లిరికల్ సాంగ్ ఏమి బతుకు ఏమి బతుకు కు మంచి స్పందన లభించింది. మంగ్లీ పాడిన ఈ సాంగ్ కి సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సాంగ్ ను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ చూసి చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు.

ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, “1997 నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, డాక్టర్ మోహన్ ముఖ్య పాత్రల్లో డాక్టర్ మోహన్ డాక్టర్ మోహన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలోని పాట విన్నాను, కథ గురించి తెలుసుకున్నాను. ఈ రోజుల్లో కూడా మనల్ని బాధ పెడుతున్న సమస్యల గురించి సినిమా తీశారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. నిజంగా ఇలాంటి మంచి ప్రయత్నం చేసిన మోహన్ అండ్ టీమ్ నీ అభినందిస్తున్నాను. అలాగే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నాను” అని అన్నారు.

త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం లో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి నటించడంతో పాటు సంగీతం అందిస్తుండటం విశేషం. ఈశ్వర్ పార్వతి మూవీస్ పతాకంపై మీనాక్షి రమావత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు