వైరల్..మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్.!

Published on Oct 2, 2021 8:00 am IST


ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మా ఎన్నికలు(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు కి సంబంధించి రోజురోజుకి హీట్ ఎక్కుతూ వెళ్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి శరవేగంగా మారుతున్న పరిస్థితుల్లో నిన్ననే బండ్ల గణేష్ కూడా తన నామినేషన్ ని విరమించుకున్నారు.

దీనితో పోటీ ప్రకాష్ రాజ్ మరియు నటుడు మంచు విష్ణు ల మధ్యనే ఏర్పడింది. దీనితో మరింత రసవత్తరంగా మారిన ఈ ఎన్నికలు లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పరమైన టాపిక్ వచ్చింది. దీనిపై మంచు విష్ణు చేసిన కామెంట్స్ కి గాను ప్రకాష్ రాజ్ సాలిడ్ కౌంటర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

పవన్ ఫస్ట్ డే మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండవు మీ సినిమా బడ్జెట్. పవన్ విషయంలోనే కాదు ఎవరిపై అయినా కూడా మంచు విష్ణు అలాంటి కామెంట్స్ చెయ్యడం సమంజసం కాదు అని కొన్ని హాట్ కామెంట్స్ ప్రకాష్ రాజ్ చెయ్యడం జరిగింది. దీనితో ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :