భీమ్లా నాయక్: కక్ష సాధింపులు బాక్సాఫీస్ దగ్గర ఎందుకు? – ప్రకాష్ రాజ్

Published on Feb 27, 2022 4:31 pm IST

పవర్ స్టార్ పవన్, హ్యండ్సం హంక్ రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఉన్న పరిస్థితుల రీత్యా భారీ వసూళ్లను రాబట్టడం లో విఫలం అవుతోంది అని చెప్పాలి. రాష్ట్రం లో ఉన్న పరిస్థితులు రీత్యా నటుడు ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

దయచేసి ఈ దాడికి స్వస్తి పలకండి అంటూ భీమ్లా నాయక్ హ్యాశ్ ట్యాగ్ ను జత చేస్తూ ఒక పోస్ట్ చేశారు. సృజన, సాంకేతికత మేళవించిన సినిమా రంగం పై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏమిటి అంటూ సూటిగా ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమ ను క్షోభ పెడుతూ, మేమే ప్రోత్సహిస్తున్నామని అంటే నమ్మాలా అని అన్నారు. ఏవైనా ఉంటే రాజకీయ క్షేత్రం లో చూసుకోవాలి అని, కక్ష సాధింపులు బాక్సాఫీస్ వద్ద ఎందుకు అని అన్నారు. ఎంతగా ఇబ్బంది పెట్టినా, ప్రేక్షకుల ఆదరాభిమానులకు ఎవరూ అడ్డుకట్ట వేయలేరు అంటూ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :