మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను – ప్రకాష్ రాజ్

Published on Oct 11, 2021 11:50 am IST

మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ప్రాంతీయ వాదం తీసుకొచ్చారు. నేను తెలుగు వాడిని కాదు అని నన్ను ఓడించారు, అలాంటప్పుడు మా సభ్యుడు గా ఉండటం లో అర్దం లేదు అని అన్నారు. మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా అని అన్నారు. అయితే తెలుగులో నటించడం కొనసాగిస్తాను అని అన్నారు.

ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాయి. ఇప్పటికే కొణిదెల నాగబాబు సైతం మా కి రాజీనామా చేయగా, పోటీ చేసిన ప్రకాష్ రాజ్ రాజీనామా చేయడం పట్ల సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :