పెద్దల ఆశీర్వాదం నాకొద్దు – ప్రకాశ్‌ రాజ్‌

Published on Oct 4, 2021 12:29 pm IST

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండే సరికి ప్రకాశ్‌ రాజ్‌ లో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. నరేశ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ‘నరేష్ అహంకారి, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడితే మంచిది. మా అసోసియేషన్ సిగ్గుపడేలా నరేష్ ప్రవర్తిస్తున్నారు. నన్ను తెలుగువాడు కాదని నరేష్‌ అన్నారు. కానీ నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌లో ఎవరికి రాదు. నన్ను పెంచింది తెలుగు భాష. మా అసోసియేషన్ కోసం ఒక బాధ్యత పనిచేయాలని వచ్చాను’ అంటూ ప్రకాశ్ రాజ్ ఎమోషనల్ గా మాట్లాడుకుంటూ వెళ్లారు.

అలాగే ప్రకాష్ రాజ్ సినీ పెద్దలు, వాళ్ళ సపోర్ట్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ‘పెద్దల ఆశీర్వాదం నాకొద్దు. మా ఎన్నికల్లో నా సత్తా పై గెలుస్తా. పెద్దలను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలి. దయతో గెలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చోవాలి. మా ఎన్నికల పై ప్రశ్నిస్తే బెదిరించారు. నేను ఒక ఉత్తరం రాస్తే మా అసోసియేషన్‌కు తాళం పడేది. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తెలుసు’ అంటూ ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :