సమీక్ష : ప్రాణం ఖరీదు – అంతగా ఆకట్టుకోని సందేశాత్మక చిత్రం

Pranam Khareedu movie review

విడుదల తేదీ : మార్చి 15, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : తారక రత్న, ఒరాట ప్రశాంత్ , అవంతిక

దర్శకత్వం : పి ఎల్ కె రెడ్డి

నిర్మాత : నల్లమోపు సుబ్బారెడ్డి

సంగీతం : వందేమాతరం శ్రీనివాస్

సినిమాటోగ్రఫర్ : ఎస్. మురళీ మోహన్ రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి హిట్టు సినిమా ప్రాణం ఖరీదు అనే టైటిల్ తో ఈరోజు ఒక చిన్న చిత్రం విడుదలైయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

రామ్ (ప్రశాంత్) అనే క్యాబ్ డ్రైవర్ ఒక ఉన్నత వర్గానికి చెందిన డాక్టర్ ను, అతని మధ్యవర్తిని కిడ్నాప్ చేస్తాడు. సినిమా గడుస్తున్న కొద్దీ రామ్ ఆ కిడ్నాప్ చేయడానికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటపెడుతుంటాడు. . అసలు ఇంతకీ ఆ రామ్ ఎవరు? కిడ్నాప్ చేయటానికా గల కారణాలేంటి?, వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

హీరో ప్రశాంత్ లుక్స్ పరంగా అలాగే నటన పరంగా కూడా ఓకే అనిపించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన ఆకట్టుకుంది. హీరోయిన్ అవంతిక కు ఈచిత్రంలో మంచి పాత్ర దొరికింది ఆ రోల్ లో ఆమె నటన బాగుంది. హాస్పిటల్ సీన్ లో ఆమె నటన సన్నివేశాలను ఎలివేట్ చేసింది.

ఇక పోలీస్ పాత్రలో నటించిన హీరో తారక రత్న ఆపాత్రకు న్యాయం చేశాడు. అలాగే సపోర్టింగ్ రోల్స్ లో నటించిన నటీనటుల నటన కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఇక ఈసినిమా కథ పాతదే. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. ఇక ఈసినిమా విషయానికి వస్తే కథ తో కథనం కూడా ఆసక్తిగా అనిపించదు. దాంతో సినిమా అంతా బోరింగ్ గా తయారైయింది.

వీటికి తోడు మధ్య మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి.

సాంకేతిక విభాగం :

డైరెక్టర్ పీఎల్ కే రెడ్డి కథలో కొత్తదనం ఏమీ లేకపోయినప్పటికీ వైద్య రంగంలో ఉన్న అవయవాల మాఫియాను తెరపై పెట్టడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. దర్శకుడు కథా కథనాల మీద గనక కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే, సినిమా ఇంకా బాగా వర్కౌట్ అయ్యుండేది. ఎడిటింగ్ ఆశించిన స్థాయిలో లేదు, ప్రథమార్థంలో కొన్ని సీన్లు కట్ చేసి ఉండాల్సింది. బడ్జెట్ పరిమితులను పరిగణలోకి తీసుకుంటే సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. సంగీతం నిరాశ పరిచిందనే చెప్పాలి, సినిమాలోని ఒక్క పాట కూడా మెప్పించకపోయినప్పటికీ కొన్ని కొన్ని కీలక సన్నివేశాల్లో నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నిర్మాణ విలువలు తక్కువ బడ్జెట్ సినిమాలకు తగినట్టుగానే ఉన్నాయి.

తీర్పు :

మెడికల్ ఇండస్ట్రీ లో వుండే చీకటి కోణాలను ప్రధాన అంశంగా చేసుకొని తెరకెక్కిన ఈ ప్రాణం ఖరీదు రోటీన్ రివెంజ్ డ్రామాగా మిగిలిపోయింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ అవ్వగా మిగితా వన్నీ మైనస్ అయ్యాయి.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version