వైరల్ : తన కూతురు ఆర్న క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రణీత

Published on Aug 2, 2022 1:00 am IST

తెలుగు సినిమా పరిశ్రమకు తొలిసారిగా ఏం పిల్లో ఏం పిల్లడో మూవీతో ఎంట్రీ ఇచ్చారు యువ భామ ప్రణీత సుభాష్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, మహేష్ బాబు బ్రహ్మోత్సవం, ఎన్టీఆర్ రామయ్యా వస్తావయ్యా మూవీస్ లో మంచి ఆకట్టుకునే రోల్స్ చేసి ఆడియన్స్ నుండి బాగా పేరు అందుకున్నారు ప్రణీత.

ఇక గత ఏడాది నితిన్ రాజుని వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్న ప్రణీత ఇటీవల పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. కాగా పాపకి ఆర్న అని నామకరణం చేశారు. ఇక నేడు తొలిసారిగా కూతురు ఆర్న తో కలిసి దిగిన క్యూట్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రణీత. ఆ పిక్స్ చూసిన పలువురు నెటిజన్స్ ఆర్న కి గుడ్ బ్లెస్సింగ్స్ ఇస్తూ విష్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆ పిక్స్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం :