కూతురి విషయంలో ఎమోషనలైన ప్రణీత !

Published on Jan 30, 2023 10:30 pm IST

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద, రభస, డైనమైట్‌’ వంటి పలు చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఐతే, స్టార్ హీరోయిన్ కాలేకపోయిన ఈ కన్నడ భామ నితిన్ రాజు అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

పైగా ప్రణీత సుభాష్‌ ఒక కుమార్తెకు జన్మినిచ్చింది కూడా. ఆమె కూతురు పేరు ఆర్నా. ఐతే, మలయాళ స్టార్‌ హీరో దిలీప్, దర్శకుడు రతీష్‌ రఘునందన్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో ప్రణీత హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సందర్భంగా ప్రణీత సుభాష్‌ మాట్లాడుతూ.. ‘మాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను అమ్మగా మారిన తర్వాత ఒప్పుకున్న తొలి సినిమా ఇది. ఈ మూవీ కోసం నా కుమార్తె ఆర్నాకు దూరంగా ఉండాల్సి వస్తోంది. అందుకు కొంచెం బాధగా ఉంది’ అంటూ ప్రణీత చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం :