అందాల తారకు సీమంతం.. ఫోటోలు వైరల్ !

Published on May 16, 2022 7:15 pm IST

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఏ ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోయిన్ కాలేకపోయిన ఈ కన్నడ భామ నితిన్ రాజు అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రణీత సుభాష్‌ త్వరలో తల్లి కాబోతుంది. కాగా తాజాగా ప్రణీతకు సీమంతం జరిగింది.

సీమంతం కోసం ప్రణీత సుభాష్ పసుపు పచ్చని చీరను ధరించింది. ఇక ఘనంగా జరిగిన తన సీమంతానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి ప్రణీత సుభాష్ కు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొత్తానికి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ప్రణీత.. త్వరలోనే తల్లిగా మారబోతుంది.

సంబంధిత సమాచారం :