తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్స్ అధినేత..!

Ramesh 1

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ప్రసాద్ ఐ మ్యాక్స్ థియేటర్స్ అధినేత రమేష్ ప్రసాద్ అన్నారు. నేడు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసిన రమేష్ ప్రసాద్ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న తెలుగు సినీ పరిశ్రమను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అండగా నిలిచిందని అన్నారు.

లాక్‌డౌన్‌లో షూటింగ్‌లు లేక ఏడాది పాటు సినిమా థియేటర్లు మూతపడడంతో వేలాది మంది అనేక ఇబ్బందులకు గురయ్యారని, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ రంగంపై ఆధారపడిన వారిలో ఎంతో మనోధైర్యాన్ని నింపుతుందని రమేష్ ప్రసాద్ మంత్రి తలసానితో అన్నారు. అయితే దీనిపై మాట్లాడిన మంత్రి తలసాని తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు. సినీ పరిశ్రమలోని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే వాటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తానని ఈ మేరకు మంత్రి తలసాని హామీ ఇచ్చారు.

Exit mobile version