ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర మరోసారి తన సినిమాతో మరోసారి హాట్ టాపిక్ గా నిలిచిన యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, తన “హను మాన్” తో ఒక ఊహించని ట్రీట్ ని ఇచ్చాడు. మరి తన మొదటి సినిమా నుంచి కూడా ఏదొక వైవిధ్యతను చూపిస్తూ వస్తున్నా ప్రశాంత్ వర్మ ఒకో జానర్ ని టచ్ చేస్తూ వెళ్తున్నాడు. అలా ఇప్పుడు మన తెలుగు నుంచి మొట్ట మొదటి సూపర్ హీరో అంటూ తెరకెక్కించిన సినిమా “హను మాన్” తో ఓ రేంజ్ హైప్ ని అందించాడు.
మరి ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్రమోషన్స్ టైం లో చేసిన కొన్ని కామెంట్స్ అప్పుడు తనపై ట్రోల్స్ కూడా వచ్చేలా చేసాయి. తాను తనకి సమయం మంచి బడ్జెట్ ఇస్తే ఖచ్చితంగా అవతార్ రేంజ్ సినిమా చేసి చూపిస్తాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు కానీ అప్పుడు చాలా మంది అది ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ పెదవి విరిచారు. ఇంకొందరు తనని ట్రోల్స్ కూడా చేశారు.
కానీ హను మాన్ రిలీజ్ అయ్యా మాత్రం ఆ కామెంట్స్ ట్రోల్స్ చేసిన వారి అందరినీ ఆశ్చర్యానికి లోను చేసాడు ప్రశాంత్ వర్మ. ఇంత తక్కువ బడ్జెట్ లో కూడా ఈ రేంజ్ విజువల్స్ ని అయితే చాలా మంది ఊహించలేదని చెప్తున్నారు. దీనితో ప్రశాంత్ వర్మ అనుకున్నట్టుగా బడ్జెట్ ఒక రెండేళ్ల సమయం ఇస్తే అవతార్ లాంటి సినిమా చేసినా చేస్తాడు అని చాలా మంది అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం ప్రశాంత్ తన వర్క్ తోనే అందరికీ సమాధానం ఇచ్చాడని చెప్పాలి.