“ఆర్ఆర్ఆర్” టీమ్ కి కేజీఎఫ్ డైరెక్టర్ కంగ్రాట్స్!

Published on Mar 25, 2022 9:31 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రౌద్రం రణం రుధిరం చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం కి వస్తున్న రెస్పాన్స్ పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు ఆర్ ఆర్ ఆర్ టీమ్ కి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ మేరకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ సైతం సోషల్ మీడియా వేదిక గా కంగ్రాట్స్ తెలిపారు.

ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ కి మరియు నిర్మాత డివివి దానయ్య కి కంగ్రాట్స్ తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పెర్ఫార్మెన్స్ సెన్సేషన్ అంటూ చెప్పుకొచ్చారు. రాజమౌళి గురించి ఏం చెప్పగలం అంటూ చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :