ప్రభాస్ ఎలివేషన్‌లపై ప్రశాంత్ నీల్ ఫోకస్..!

Published on May 28, 2022 10:27 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల “రాధేశ్యామ్‌” మూవీతో ప్రేక్షకులను పలకరించినా ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ప్రభాస్ అభిమానులు ఇప్పుడు యాక్షన్ ఫిల్మ్ “సలార్”పై బోలెడన్ని ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ కూడా తన తదుపరి సినిమాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా సలార్‌కి సంబంధించి కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మాట్లాడుతూ సినిమా తన అభిమానుల అంచనాలకు చేరేలా ఉండాలని చెప్పారట.

అయితే తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ మోకాలు దెబ్బ మరియు నడుము సర్జరీ ను దృష్టిలో ఉంచుకొని ప్రశాంత్ ప్రభాస్ కోసం తన స్టైల్‌లో ఎలివేషన్‌లు ఎక్కువ యాక్షన్ తక్కువ ఉండే ఫైట్ సన్నివేశాలను ప్లాన్ చేస్తున్నారట. కెజిఎఫ్ 2 తన ఎలివేషన్లు తో మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రశాంత్ ప్రభాస్ విషయంలో కూడా అదే చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోందో అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :