విజయ్ “బీస్ట్” ట్రైలర్ పై ప్రశాంత్ నీల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్

Published on Apr 3, 2022 6:11 pm IST

తలపతీ విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం బీస్ట్. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ ట్రైలర్ ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. సౌత్ లోనే టాప్ ట్రైలర్ గా దూసుకు పోవడం విశేషం. ఇప్పటి వరకూ ఈ ట్రైలర్ 28 మిలియన్స్ వ్యూస్ రాగా, 2.1 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ ట్రైలర్ పై ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. వావ్, అన్నికంటే బెస్ట్ గా ఉంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది, డైరక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్, విజయ్ సర్ ఫైర్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్2 చిత్రం ఏప్రిల్ 14 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుండగా, బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :