“రాధే శ్యామ్” ట్రైలర్ పై ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

Published on Dec 24, 2021 2:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్” చిత్రం నుంచి అభిమానులు ఎప్పుడు నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ట్రైలర్ ని మేకర్స్ నిన్న అన్ని భాషల్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ విజువల్ గ్రాండియర్ చూసాక ప్రతీ ఒక్కరిలో మరిన్ని అంచనాలు రేకెత్తగా ఇప్పుడు ఈ ట్రైలర్ పై మరో సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం ఆసక్తిగా మారింది.

రాధే శ్యామ్ ట్రైలర్ మొదటి నుంచి ఎండ్ అయ్యే వరకు కూడా అమేజింగ్ విజువల్స్ తో ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది అని, ప్రతి సెకండ్ కూడా ట్రీట్ ఇచ్చేలా అనిపిస్తుంది. ప్రభాస్ సర్ తో పాటు దర్శకుడు రాధా కృష్ణ మొత్తం టీం కి కంగ్రాట్స్ తెలిపారు. మరి యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన ఈ భారీ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం :