విశాల్ ‘లాఠీ’ టీమ్ కి కెజిఎఫ్ డైరెక్టర్ బెస్ట్ విషెస్

విశాల్ ‘లాఠీ’ టీమ్ కి కెజిఎఫ్ డైరెక్టర్ బెస్ట్ విషెస్

Published on Dec 22, 2022 1:46 AM IST


యువ నటుడు విశాల్ లేటెస్ట్ గా నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ లాఠీ. ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ డిసెంబర్ 22న అనగా రేపు ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ మూవీ యొక్క సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ పై భారీ స్థాయి అంచనాలు ఏర్పరిచాయి.

రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమణ, నంద కలిసి నిర్మించిన లాఠీ మూవీ మంచి విజయం అందుకోవాలని కోరుతూ కొద్దిసేపటి క్రితం కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో విశాల్ కి, మూవీ టీమ్ కి అలానే ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ మూవీ ద్వారా నిర్మాతగా ఆడియన్స్ ముందుకి వస్తున్న తన మిత్రుడు రమణ కి ప్రత్యేకంగా ముందస్తు విషెస్ తెలిపారు. సునయన హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కోసం ఆద్యంతం యూనిట్ మొత్తం ఎంతో కష్టపడ్డాం అని, తప్పకుండా మా అందరి కష్టాన్ని ఆడియన్స్ ఆదరిస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు లాఠీ మూవీ మేకర్స్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు