ట్విస్ట్ కా బాప్.. డ్రాగన్ ఎలాంటి సినిమానో తేల్చేసిన ప్రశాంత్ నీల్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘డ్రాగన్’ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్‌తో ఒక్కసారిగా ‘డ్రాగన్’ మూవీపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ గ్లింప్స్‌ను ఫక్తు నీల్ మార్క్ కంటెంట్‌తో కట్ చేసిన తీరు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుంది. ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా ప్రశాంత్ నీల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

ఈ సినిమా గ్లింప్స్ విషయంలో తాము చాలా ఆలోచనలు చేశామని.. అయితే, తన గత చిత్రాల మాదిరిగా హీరో చుట్టూ కథను తిప్పకుండా.. ఈ సారి కథలో హీరో ముందుకు సాగుతుంటాడు.. ఇలాంటి కథను ఎంత డీటెయిలింగ్‌గా చెబితే ప్రేక్షకులకు అంతగా నచ్చుతుందని నీల్ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమా గ్లింప్స్‌లో తాము చూపెట్టిందంతా ఒక సెటప్ అని.. వాస్తవానికి తమ టీమ్ అందరూ కలిసి ఓ గొప్ప దేశభక్తి చిత్రాన్ని రూపొందిస్తున్నామని నీల్ గర్వాంగా చెప్పుకొచ్చాడు.

దీంతో గ్లింప్స్‌లో లేని అంశాన్ని నీల్ చెప్పడంతో ఇప్పుడు అభిమానుల్లో డ్రాగన్ మూవీపై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమా కథ అసలు ఎలా సాగనుందా.. ఎన్టీఆర్ నుంచి ఎలాంటి విధ్వంసాన్ని చూపించబోతున్నారా.. అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Exit mobile version