బాలయ్య అన్ మ్యాచబుల్ అంటున్న ప్రశాంత్ వర్మ!

Published on Oct 17, 2021 10:40 pm IST

నందమూరి బాలకృష్ణ ప్రేక్షకులను, అభిమానులను అలరించడానికి సిద్దం అవుతున్నారు. బాలయ్య హోస్ట్ గా ఒక సరికొత్త షో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ షో అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ సంస్థ ఆహా వీడియో లో ఈ కార్యక్రమం ప్రసారం కానుంది. బాప్ ఆఫ్ ఆల్ షోస్ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ రానుంది. ఈ షో లో కి ప్రముఖ టాలీవుడ్ హీరో హీరోయిన్ లు రానున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ ఈ షో కి సంబందించిన ఒక వర్కింగ్ స్టీల్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. బాలయ్య అన్ మ్యాచబుల్ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఎనర్జీ అన్ స్టాపబుల్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక జై బాలయ్య అంటూ హ్యాశ్ ట్యాగ్ ను జత చేశారు.

బాలయ్య మొదటి సారి ఒక కార్యక్రమం కి హోస్ట్ గా వ్యవహరిస్తుండటం తో అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More