పవర్ ఫుల్ గా ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ ల “హను మాన్” టీజర్!

పవర్ ఫుల్ గా ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ ల “హను మాన్” టీజర్!

Published on Nov 21, 2022 12:50 PM IST

జాంబి రెడ్డి చిత్రం తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు సూపర్ హీరో ఫిల్మ్ హను మాన్ తో ప్రేక్షకులను మరోసారి అలరించడానికి సిద్దం అయ్యారు. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం టీజర్ ను నేడు మేకర్స్ విడుదల చేయడం జరిగింది. టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. పవర్ ఫుల్ కట్ టీజర్ రామ భక్తి తో ఉన్న హను మాన్ ను మరింత పవర్ ఫుల్ గా చూపించడం జరిగింది.

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా టీజర్ రిలీజ్ కి ఎందుకు సమయం తీసుకున్నారు అనేది టీజర్ క్వాలిటీ ను చూస్తే తెలుస్తుంది. అద్భుతమైన దృశ్యాలతో టీజర్ ను నింపేశారు. కెమెరామన్ శివేంద్ర వర్క్ చాలా ఆకట్టుకుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆకట్టుకున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్‌మెంట్ నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. VFX వర్క్ టాప్ క్వాలిటీతో ఉంది. సన్నివేశాలను మరో స్థాయిలో ఎలివేట్ చేసింది.

విడుదలైన టీజర్ సినిమా పై భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా, వరలక్ష్మీ శరత్ కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుంది. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కె నిరంజన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. హను మాన్ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు