ఆదిపురుష్: ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ షో కుదరలేదు – ప్రశాంత్ వర్మ

Published on Jun 10, 2023 12:06 am IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాముడుగా నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఈ చిత్రం జూన్ 16, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ చిత్రం కి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతి లో నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిజైన్ చేసిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చాలా ప్లాన్ చేశాం అని, కాకపోతే వాటిని ఎగ్జి క్యూట్ చేయడానికి పర్మిషన్ లేదని అన్నారు. అందులో ఒకటి ఈ డ్రోన్ షో అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. కృతి సనన్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :