పాన్ ఇండియన్ లెవెల్ ప్రామిసింగ్ గా “హను – మాన్”.!

పాన్ ఇండియన్ లెవెల్ ప్రామిసింగ్ గా “హను – మాన్”.!

Published on Sep 18, 2021 10:44 AM IST

టాలీవుడ్ మరో యంగ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ప్రశాంత్ వర్మ తన సినిమాలతో ఎలాంటి ఇంపాక్ట్ ని అన్ని సినిమా వర్గాల్లో కలిగించాడో తెలిసిందే. తన ఫస్ట్ సినిమాతోనే ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్ ని సెట్ చేసిన ప్రశాంత్ వర్మ లేటెస్ట్ గా “జాంబీ రెడ్డి” తో ఫస్ట్ ఎవర్ జాంబీ కాన్సెప్ట్ ని పరిచయం చేసాడు. ఇలా తన ప్రతీ సినిమాకి సరికొత్త జానర్ ని పరిచయం చేస్తున్న ప్రశాంత్ నుంచి రాబోతున్న సరికొత్త చిత్రమే “హను – మాన్”.

భారతదేశ సిసలైన సూపర్ హీరో అవెంజర్ అయినటువంటి హనుమంతుని కాన్సెప్ట్ తో ప్లాన్ చేసిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పుడు అదిరే ఫస్ట్ లుక్ వీడియో ని లాంచ్ చేశారు. హను మాన్ అంటే వానర రూపంలో ఉండే తేజ ని చూస్తాం అనుకోవచ్చు కానీ ఇది మాత్రం కంప్లీట్ డిఫరెంట్ గా అదిరే విజువల్స్ లో ఇది కనిపిస్తుంది.

అంతే కాకుండా ఇందులోనే లాస్ట్ చూపించిన విజువల్ కూడా మరింత ఆసక్తి రేపుతోంది. తేజ కూడా ఇందులో చాలా బాగా కనిపిస్తున్నాడు. ఫైనల్ గా ఇందులోనే వీరు ఈ సినిమాని పాన్ ఇండియన్ లెవెల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఓవరాల్ గా అయితే మాత్రం పాన్ ఇండియన్ లెవెల్లో ఖచ్చితంగా ప్రామిసింగ్ గా ఈ సినిమా ఉండేలా ఉందని చెప్పొచ్చు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు