కట్టప్పని మారుతి చిన్నపిల్లాడ్ని చేశేశాడేంటీ…!

Published on Sep 12, 2019 8:42 am IST

దశాబ్దాలుగా హీరోగా, విలన్ గా చేసినా రానంత గుర్తింపు బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర ద్వారా దక్కించుకున్నాడు సత్యరాజ్. ఆయన ఈ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. గత కొంతకాలంగా సత్య రాజ్ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఆయన మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజు పండగే చిత్రంలో నటిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పక్కా గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని సమాచారం.

కాగా నిన్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. వర్షంలో చిన్నపిల్లాడిలా గెంతుంతున్న సత్యరాజ్ ని తేజ్ వారిస్తున్నట్లున్న ఆ పోస్టర్ వైవిధ్యంగా ఉంది. సత్యరాజ్ ని ఈ చిత్రంలో గతానికి భిన్నంగా దర్శకుడు మారుతి ప్రెసెంట్ చేస్తారని ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతుంది. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More