నితిన్ నుండి అఫర్ అందుకున్న ప్రవీణ్ సత్తారు !

6th, November 2017 - 06:15:36 PM

‘చందమామ కథలు, గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలతో మెప్పించిన దర్శకుడు ప్రవీణ్ సత్తారు తాజాగా సీనియర్ హీరో రాజశేఖర్ హీరోగా ‘పిఎస్వి గరుడవేగ’ అనే సినిమా చేసి విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంతో ప్రవీణ్ సత్తారు తనను నిలబెట్టాడని, సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనదేనని రాజశేఖర్ స్వయంగా అన్నారు. ఈ సక్సెస్ తో ప్రవీణ్ సత్తారుకు డిమాండ్ పెరిగింది.

హీరో నితిన్ స్వయంగా ప్రవీణ్ సత్తారుతో సినిమా చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. సత్తారు కూడా నితిన్ ఆఫర్ కు ఓకే చెప్పారని, శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబందించి ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే నితిన్ ప్రస్తుతం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమా చేస్తుండగా ప్రవీణ్ సత్తారు పుల్లెల గోపీచంద్ బయోపిక్ పై వర్క్ చేస్తున్నారు.