ప్రీ లుక్ పోస్టర్ తో వచ్చిన మరో బయోపిక్ !

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు అన్ని సినీ పరిశ్రమలోనూ బయోపిక్ హవా నడుస్తోంది. దానికి తగ్గట్లుగానే బయోపిక్ సినిమాలకు ఆదరణ బాగానే ఉంది. ఇక ఇప్పటికే పలువురు నాయకుల బయోపిక్స్ వస్తుండగా.. వాటి కోవలోనే ఓ యువ విద్యార్థి నాయకుడి బయోపిక్ కూడా రానుంది.

విషయంలోకి వెళ్తే… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థి ఉద్యమ నాయకుడిగా మంచి పేరు సంపాదించుకున్న జార్జ్ రెడ్డి జీవితం ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో జార్జ్ రెడ్డి బయోపిక్ రానుంది. కాగా ఈ చిత్రం నుండి ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం.

ఉస్మానియా, నిజాం కళాశాల విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న జార్జ్ రెడ్డి కేవలం 25 సంవత్సరాల వయసులోనే కొంతమంది దుండగుల చేతిలో మరణించాడు. ‘వంగవీటి’ ఫేమ్ సాండీ జార్జ్ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు.

Exit mobile version