ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘వెంకటేష్’ రీమేక్ సినిమా

venkatesh
‘విక్టరీ వెంకటేష్’ హీరోగా మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘బాబు బంగారం’ చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని ఆగష్టు 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదలయ్యే లోపు వెంకీ మరో సినిమాని మొదలుపెట్టనున్నాడని తెలుస్తోంది. అదే బాలీవుడ్ చిత్రం ‘సాలా ఖదూస్’ కు రీమేక్ గా తెరకెక్కనున్న చిత్రం.

ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా వెంకటేష్ ఈ చిత్రం కోసం బాడీ బిల్డింగ్, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రంలోని పాటల కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలయ్యాయి. ఈ చిత్రాన్ని కూడా వరిజినల్ వర్షన్ ను డైరెక్ట్ చేసిన ‘సుధా కొంగర’ డైరెక్ట్ చేస్తుండగా ‘సంతోష్ నారాయణన్’ సంగీతాన్ని అందిస్తున్నారు.