టాక్..”వాల్తేరు వీరయ్య” ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్.?

టాక్..”వాల్తేరు వీరయ్య” ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్.?

Published on Dec 14, 2022 11:04 AM IST

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అలాగే మాస్ మహారాజ రవితేజ మరో కీలక పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మాస్ మల్టీ స్టారర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి మళ్ళీ వింటేజ్ బాస్ ని ప్రెజెంట్ చేసే విధంగా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఇక ఈ సినిమా పాటలు షూటింగ్ లో బిజీగా ఉండగా ఇప్పుడు అయితే చిత్రం ప్రీ రిలీజ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.

మేకర్స్ అయితే ఈ చిత్రం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని వచ్చే జనవరి 8న ఫిక్స్ చేశారట. అలాగే ఇది ఏపీలోనే జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా వేదిక ఎక్కడ అనేది బయటకి రావాల్సి ఉండగా మేకర్స్ ఇందుకు స్పెషల్ ప్లానింగ్స్ చేస్తున్నారట. ఇక ఈ అవైటెడ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ జనవరి 13న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు