“RRR” మాసివ్ ఓపెనింగ్ పై స్టార్ట్ అయ్యిన ప్రిడిక్షన్స్.!

“RRR” మాసివ్ ఓపెనింగ్ పై స్టార్ట్ అయ్యిన ప్రిడిక్షన్స్.!

Published on Mar 24, 2022 7:02 AM IST


ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొల్పుకొని పాన్ ఇండియా సినిమా దగ్గర బాక్సాఫీస్ యుద్దానికి సిద్ధం అవుతున్న మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “రౌద్రం రణం రుధిరం”. సెన్సేషన్ రేపుతూ వస్తున్న ఈ సినిమా ఓపెనింగ్స్ కోసమే ఈ రెండు రోజులు నుంచి ఆసక్తిగా చర్చ నడుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ పరంగా అయితే మన తెలుగు రాష్ట్రాల్లో సహా ఇండియాలో మాత్రం మాసివ్ నెంబర్ ని ఈ చిత్రం నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నారు.

దాదాపు ఈ సినిమా ఓపెనింగ్ డే డెఫినెట్ గా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేస్తోంది అని అలాగే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే సంచలన వసూళ్లు నమోదు అవుతాయని అంటున్నారు. ఇది వరకు ఎప్పుడు లేని రికార్డు స్థాయి ఫిగర్స్ RRR తో షురూ అవుతాయని అంటున్నారు. ఆల్రెడీ చాలా స్థాయి బిజినెస్ ని ఈ సినిమా అన్ని చోట్లా జరిపింది అలాగే అందుకు తగ్గట్టే ఈ సినిమా మాసివ్ ఓపెనింగ్ వేరే లెవెల్లో ఉంటాయని అంతా అంటున్నారు. మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్త ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు