“నాటు నాటు” మాస్ స్టెప్ ను ఇలా వేయండి…వీడియో షేర్ చేసిన ప్రేమ్ రక్షిత్!

Published on Nov 17, 2021 5:32 pm IST

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, విడియోలు, పాటలు సినిమా పై ఆసక్తి పెంచేశాయి.

ఈ చిత్రం నుండి నాటు నాటు అంతెం పాట విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మాస్ బీట్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ పాట కి స్టెప్పులు వేస్తూ, అభిమానులు సోషల్ మీడియా లో రీల్స్ చేస్తూ షేర్ చేస్తున్నారు. అయితే ఈ నాటు బీటు కి ఈ తరహా క్రేజీ రెస్పాన్స్ రావడం తో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాగా డాన్స్ వేయాలి అనుకునే వారి కోసం కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఇందుకు సంబంధించిన వీడియో ను షేర్ చేయడం జరిగింది.

ఈ వీడియో లో నాటు నాటు స్టెప్ కి సంబంధించిన ట్యుటోరియల్ ను చూపించారు. ఇప్పుడు ఈ వీడియో చూసి ప్రాక్టీస్ చేస్తూ నాటు నాటు కి స్టెప్పులు వేయొచ్చు. మీరు కూడా ఈ వీడియో చూసేయండి. అలియా భట్, ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్, సముద్ర ఖని లు ఈ చిత్రం లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More