నాని సరసన ‘ప్రేమమ్’ హీరోయిన్ !

24th, April 2017 - 08:43:02 AM


నేచ్యురల్ స్టార్ నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ‘నిన్ను కోరి’ పూర్తి కావోస్తుండటంతో నూతన దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. మే నెలలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ గా ‘ప్రేమమ్’ బ్యూటీ సాయి పల్లవిని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. సాయి పల్లవి కూడా ఈ ప్రాజెక్టుకు సైన్ చేశారట.

తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ‘ఫిదా’, మరియు ‘చార్లీ’ తమిళ రీమేక్లో నటిస్తున్న ఈమె ‘చార్లీ’ షూట్ కాస్త వాయిదాపడి కాస్త గ్యాప్ దొరకడంతో ఈ సినిమాకు డేట్స్ ఇచ్చారట. పూర్తి స్థాయి ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉందనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా శ్రీకనట్, భూమిక వంటి సీనియర్ నటులు కూడా ఇందులో నటిస్తున్నారు.