‘ప్రేమమ్’ గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్షన్స్!

12th, October 2016 - 09:18:27 AM

premam
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ గత శుక్రవారం భారీ అంచనాల మధ్యన విడుదలై హిట్ దిశగా దూసుకెళుతోన్న విషయం తెలిసిందే. మొదటి రోజునుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పటికే అంతటా మంచి ఓపెనింగ్స్ సాధించగా, దసరా సెలవుల్లో కూడా కలెక్షన్స్ అదే స్థాయిలో ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ సినిమా గుంటూరు జిల్లాలో 95,83,795 రూపాయలు వసూలు చేసింది. అదేవిధంగా కృష్ణాలో 88,06,693 రూపాయలు వసూలు చేసింది.

ఇక దసరా సెలవులు ఉండడం, వచ్చే వారాంతం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ప్రేమమ్ కలెక్షన్స్ మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. లాంగ్‌రన్‌లో నాగ చైతన్య కెరీర్‌కు ప్రేమమ్ సోలో హీరోగా పెద్ద హిట్‌గా నిలుస్తుందన్న అభిప్రాయం ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో చైతన్య తన నటనతో అందరినీ కట్టిపడేస్తున్నారు. చైతన్య సరసన శృతి హాసన్‌, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు.