‘ప్రేమమ్’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్!
Published on Oct 9, 2016 9:51 am IST

premam
అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ప్రేమమ్’ గత శుక్రవారం భారీ అంచనాల మధ్యన ప్రేక్షకుల ముందుకు వచ్చేసిన విషయం తెలిసిందే. మళయాలంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్‌కు రీమేక్ కావడంతో ఈ సినిమాపై మొదట్నుంచీ విపరీతమైన క్రేజ్ కనిపించింది. ఇక ఆ క్రేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా, అంచనాలను అందుకున్న సినిమా మొదటి రోజునుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. నాగ చైతన్య కెరీర్‌కే అతిపెద్ద హిట్‌గా ప్రేమమ్ నిలుస్తుందన్న ప్రచారం రావడంతో యూఎస్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రేమమ్ ఓపెనింగ్స్‌లో సత్తా చాటింది.

గురువారం ప్రీమియర్స్, శుక్రవారం.. కలుపుకొని యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 209కే డాలర్లు (సుమారు 1.39 కోట్ల రూపాయలు) వసూలు చేసింది. శని, ఆదివారాల్లో కలెక్షన్స్ జోరు ఇలాగే కొనసాగుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నాగ చైతన్య తన నటనతో అందరినీ కట్టిపడేస్తున్నారు. చైతన్య సరసన శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు.

 
Like us on Facebook